![]() |
![]() |

జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో అదిరే అభి కూడా ఒకరు. టీమ్ లీడర్ గ ఉంటూ మంచి కాన్సెప్ట్స్ తో స్కిట్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవాడు. జబర్దస్త్ స్టార్టింగ్ లో అదిరే అభి స్కిట్స్ ఫుల్ కామెడీని పంచేవి. ఐతే తర్వాత కొత్త వాళ్ళు రావడంతో పాత టీమ్ లీడర్స్ చాలా మంది కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. అలాగే అదిరే అభి కూడా వెళ్ళిపోయాడు. ఐతే అదిరే అభి పేరు ఎవరు పెట్టారు అసలు తన ఒరిజినల్ పేరేమిటో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. "అభినయ్ కృష్ణ" అనేది నా ఒరిజినల్ పేరు. ఐతే ఈ పేరు కంటే ముందు స్కూల్ లో ఉన్న పేరు "హరికృష్ణ". అభినయ్ కృష్ణ అనే పేరును సి.నారాయణ రెడ్డి గారు పెట్టారు.
ఇక ఆ పేరును అలా కంటిన్యూ చేస్తూ జబర్దస్త్ కి వచ్చినప్పుడు ఒక టాగ్ లైన్ ఉండాలి అన్నారు.. అప్పుడు "అదిరే అభి" అని పెట్టుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. చుట్టాల పెళ్లిళ్లలో ముందుగా తానే వెళ్లి డాన్స్ చేసేవాడిని అని చెప్పారు. డిగ్రీ చదివేటప్పుడు సరే ఒకసారి ఇండస్ట్రీలో ట్రై చేద్దామని వచ్చినప్పుడు రైటర్ జనార్దన్ మహర్షి గారు చదువు కంప్లీట్ చేసుకుని రమ్మన్నారు. దాంతో వెనక్కి వచ్చి చదువు పూర్తి చేసాను అని అన్నాడు.
అలా ఒకసారి ఈశ్వర్ మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు తాను చేసిన డాన్స్ , మిమిక్రీ పెర్ఫార్మన్స్ చూసాక ఈశ్వర్ మూవీకి సెలెక్ట్ చేసినట్లు చెప్పాడు. ఫస్ట్ డే షూటింగ్ లో ప్రభాస్ తో "అరె మావా ఈరోజు మొత్తం జాతరకు వచ్చినట్టు వచ్చార్రా" అని చెప్పడం నిజంగా కొంచెం భయం అనిపించింది ఎందుకంటే కృష్ణం రాజు గారి వారసుడు అలాంటి అతన్ని అరె మావా అనడం ఏమిటి అనుకున్నా కానీ నటించడం ప్యాషన్ కాబట్టి చేసేసాను అని చెప్పాడు.
![]() |
![]() |